వికలాంగుల సంరక్షణకు ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయించాలి : బివిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

Published: Wednesday December 01, 2021
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనాలని, ముందస్తు సంబరాల్లో భాగంగా, ప్రతి జిల్లాకు 10కోట్లు కేటాయించాలని, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, భారత దేశ చరిత్రలోనే వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్న ముఖ్యమంత్రిగా కేసిఆర్, చరిత్ర కెక్కాడన్ని, ఈ సారి జరిగే వికలాంగుల దినోత్సవంలోనైనా, ముఖ్యమంత్రి కే సి ఆర్ పాల్గొని, వికలాంగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చెయ్యాలని డిమాండ్ చేశారు.  వికలాంగులలో వున్న ప్రతిభను గుర్తించి ప్రతి జిల్లాలో, వికలాంగుల క్రీడలను నిర్వహించి, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం, అవార్డులు ప్రదానం చెయ్యాలని పేర్కొన్నారు. అన్ని జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చెయ్యాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా నడవలేని వారికి త్రి వీలర్ బైక్ లు ఇవ్వాలని వివరించారు. గత 3సంవత్సరాలనుండి కొత్త పెన్షన్ లు మంజూరు చెయ్యడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని సమంజసంం కాదని హితవు పలికారు. పెండింగ్ పెన్షన్ లు వెంటనే మంజూరు చెయ్యాలని, అదేవిదంగా వికలాంగుల సంక్షేమ శాఖను, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేసి, ప్రత్యేక శాఖగా కొనసాగించాలని కోరారు.