ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం

Published: Tuesday April 26, 2022
మధిర ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూనిత్యం రద్దీగా ఉన్న ఏరియాలో ఇలాంటి కార్యక్రమం చేయటం శుభ పరిణామమని ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచిది ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమం చేసిన ఆదరణ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు మధిర లో ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సాబీర'స్ మిడ్ స్ట్రీట్ అబ్దుల్ బ్రదర్స్ ఆజాద్ యూత్ ఫౌండేషన్ మహాదేవపురం ఆర్థిక సహకారంతో మధిర బస్టాండ్ ఆవరణలో ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా డిపో మేనేజర్ స్ దేవదానం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బెజవాడ రవి మధిర సేవా సమితి పల్లబోతుల ప్రసాద్ కోమిటిడి శ్రీనివాసరావు వాసవి క్లబ్ చల్ల సత్యనారాయణ బాణాల ఫౌండేషన్ శంకర చారి జి ఆర్ పి పోలీస్ ఉదయ కుమార్ ఆర్ పి ఎఫ్ వెంకన్న పకిరయ్య ట్రాఫిక్ సూపర్వైజర్ నాగుల్ మీరా  తదితరులు పాల్గొన్నారు