దళితుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం

Published: Tuesday November 30, 2021

మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి

జగిత్యాల, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): దళితుల ఐక్యత తోనే రాజ్యాధికారం సాధ్యం అవుతుందని మాల మహానాడు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మాలమహానాడు నూతన జిల్లా ఉపాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులుగా రాయికల్ మండలం కిష్టం పేట్ కు చెందిన జాన గోపి, గొల్ల పెల్లి మండలం రాపెల్లే గ్రామానికి చెందిన కల్లు అరుణ్ కుమార్ లను నియమిస్తూ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొప్పు వెంకట రమణ, జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత కుంట్ల గంగాధర్, జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షులు కోడిపెల్లి సురేష్ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జీ.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళ పెళ్లి రవి పిలుపు మేరకు ఈ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ దళితులు అంత ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్నారు. చట్ట సభల్లో వర్గీకరణ అంశం వీగిపోయిన, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన కొందరు తమ రాజకీయ పబ్బం కొరకు దళితులను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను మాల మహానాడు జిల్ల శాఖ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇప్పటికే దళితులపై, అంబేద్కర్ విగ్రహాలపై ధ్వంసం కొనసాగుతుందని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని శ్రీహరి డిమాండ్ చేశారు. దళితుల ఐక్యత తోనే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 5-10వ తేదీ వరకు జరిగే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు నాయకులు అరికెల్ల జగన్, జక్కుల అరవింద్, సూద్దాల దినేష్, జంగ పవన్ కుమార్, బాసమల్ల సురేష్, జాగిరి ప్రశాంత్, భోధనపు జగదీశ్, రాసమల్ల రాకేష్, పోడేటి ఈశ్వర్, మహంకాళి శివ కుమార్, జంగ సతీష్, గోడిసేల సందీప్ తదితరులున్నారు