పేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం!

Published: Thursday June 09, 2022

మధిర రూరల్ జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధిపేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఆర్య వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం  మధిర లోని పేద ఆర్యవైశ్యు చిరు వ్యాపారులకు ఆర్య వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్యాంకు ద్వారా రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి వాసవి చిరు వ్యాపారుల అధ్యక్షులు మిట్టపల్లి రవి, సెక్రటరీ కనికిచర్ల లక్ష్మణ నగేష్  మహిళా వ్యాపారుల సంఘం అధ్యక్షురాలు కనికచర్ల రజిని సహకారంతో ఆర్యవైశ్యులకు చిరు వ్యాపారం చేసుకొనుటకు తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం అందిస్తున్నట్లు ఆయన  తెలిపారు. ప్రతి పదిమంది ఒక గ్రూపుగా ఏర్పడితే 60 పైసలు వడ్డీతో 25 నెలలు రికవరీతో ఐదు లక్షల రూపాయల వరకు అంచలంచలుగా ఆర్థిక సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. రుణం తీసుకున్న చిరువ్యాపారులు సకాలంలో రుణం చెల్లిస్తే భవిష్యత్తులో పెద్ద స్థాయిలో రుణాలు అందిస్తామన్నారు. దీనిద్వారా చిరువ్యాపారులు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అధిక వడ్డీలు భారమవుతున్న ఈ రోజుల్లో స్వల్ప వడ్డీతో ఆర్య వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రుణాలు జరుగుతుందన్నారు. పేద ఆర్యవైశ్యు చిరు వ్యాపారులకు రుణాలు అందించినందుకు ఆర్యవైశ్య సంక్షేమ సంగం నిర్వాహకులను ఆర్యవైశ్య సంఘం నాయకులు ఇరుకుల్ల లక్ష్మీ నరసింహారావు వర్తక సంఘం అధ్యక్షులు వేముల తిరుపతిరావు దేవిశెట్టి రంగారావు  ఇరుకుల్ల సురేష్ మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, డోకు పర్తి సత్యంబాబు యర్రా లక్ష్మణ్, చల్ల సత్యం వందనపు శ్రీనివాసరావు, పబ్బతి రమేష్ తదితరులు అభినందించారు.