ఉన్నత విద్య కమిషనర్ తీరుకు నిరసనగా అతిధి అధ్యాపకుని రాజీనామా !

Published: Friday September 09, 2022
బెల్లంపల్లి , సెప్టెంబర్ 8,  ప్రజా పాలన ప్రతినిధి:
 
 
 రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ నిరంకుశ ధోరణికి నిరసనగా అతిథి అధ్యాపకులు కొండ గొర్ల చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా చేసినట్లు  తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లు లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రి కళశాలలో కంప్యూటర్ సబ్జెక్టు లో అతిధి అధ్యాపకులుగా పనిచేస్తున్న నేను  ఉన్నత విద్యాశాఖ కమిషనర్ అనాలోచిత చర్యల వల్ల  తన అధ్యాపక పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వాపోయారు, నవీన్ మిట్టల్  132 ప్రభుత్వ డిగ్రీ కళశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందకుండా చేస్తున్నారని, ఆయన నిర్లక్ష్యం, మూర్ఖపు నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిషత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని, యూజీసి నిబంధనలు గాలికి వదిలేసి తన సొంత జాగీరు అయినట్టు నిబంధనలు పెట్టి నియంత లాగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. యూనివర్సిటీ నిబంధనలని డిగ్రీ కళశాలలు పాటించాలనీ కమిషనర్ యూనివర్సిటీ స్వయం ప్రతి పత్తిని దెబ్బతీసేలా తన నిర్ణయాలు ఉన్నాయని, ప్రభుత్వ డిగ్రీ కళశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ వేరు వేరు భాషలలో తరగతులు నిర్వహించాలని ఉన్నప్పటికీ కమిషనర్ కలిపి భోధించాలని అధ్యాపకులను ఒత్తిడి చేస్తున్నారని, చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం వదులుకోవాలని బెదిరిస్తున్నా రని అన్నారు.
యూజీసీ మరియు యూనివర్సిటీ నిబంధనలను తోసి పుచ్చి కనీస సౌకర్యాలు లేకపోయినా 60 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ గా గుర్తించి విద్యా బోధన చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నా రని దాని ఫలితంగా    విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొన్ని కోర్సులను తీసేసి ప్రైవేటు కళాశాలలకు పర్మిషన్లు ఇస్తున్నారని దాని ఫలితంగా ఐదువేల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారని అన్నారు.
ఈ అతిథి అధ్యాపకులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని, చేసిన విధులకు కూడా  వేతనాలు సకాలంలో ఇవ్వకుండా ఒక నియంత లాగా పరిపాలన చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. అక్రమ ఓడి లు, రీ అలికేషన్ల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానం ఉందని వీటిపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.