చెరువులో గుర్రపుడెక్కను తొలగింపు

Published: Friday July 23, 2021
మేడిపల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ పెద్ద చెరువులో ఉన్న గుర్రపు డెక్క ను జెసిబి సహాయంతో  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తొలగింప చేశారు. వర్షాలతో చెరువులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని మోటర్ ద్వారా బయటికి పంపించేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ రజని, స్థానిక కాలనీవాసులు వెల్లంకి రవీందర్ రెడ్డి, పీ.నగేష్, జయచంద్ర రెడ్డి, మల్లయ్య, హనుమంతు టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, ఆకుల ప్రభాకర్, నందికంటి శివ, జెసిబి రాజు, సాయి ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.