రాబోవు 20 ఏళ్లు లిక్విడ్ ఇంధనానిదే డిమాండ్ : ఐ ఒ సి ఈ డి అనిల్ కుమార్... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రత

Published: Thursday December 29, 2022

రాబోవు 20 ఏళ్లు లిక్విడ్ ఇంధనానికే డిమాండ్ ఉంటుందని  ఇండియన్ ఆయిల్ తెలుగు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. తాజ్ కృష్ణ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కోవిడ్ అనంతరం తమ సంస్థ పని విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. దేశంలో అతిపెద్ద ఫ్యూయల్ రిఫైనరీ, రిటైలర్ గా ఇండియన్ ఆయిల్ నిలిచిందని,ప్రస్తుతం ప్యారదీప్ నుంచి హైదరాబాద్ మల్కాపూర్ వరకు ప్రతిష్టాత్మక పైప్ లైన్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇందనం వాడకం  అంతగా పెరగక పోవచ్చునని,10 నుంచి 20 ఏళ్ల వరకు పెట్రోల్ డీజిల్ డిమాండ్ తారాస్థాయి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణలో మార్కెట్లో అగ్రగామిగా ఐ ఒ సి కొనసాగుతూ పెట్రోల్ 34% డీజిల్ 38 శాతం ఎల్పిజిలో 40% వాటాను కలిగి ఉందని చెప్పారు. సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో తయారు చేయించిన బెంచ్ లను కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు ఐ ఒ సి ప్రతినిధులు పాల్గొన్నారు.