మూడో విడత పట్టణ ప్రగతి పల్లె ప్రగతి

Published: Friday July 02, 2021

మధిర, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరప్రగతితో మున్సిపాలిటీలో ఏండ్ల తరబడి ఉన్న సమస్యల పరిష్కారం  తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి 3వ విడుత కార్యక్రమం 7వ వార్డులో అట్టహాసంగా ప్రారంభమైంది. 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి సమస్యల జాబితాను తయారు చేయటం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిలర్ కళ్యాణి కిరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం రెండు దఫాలుగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో తుప్పు పట్టి ఉన్న విద్యుత్ స్థంభాలు తొలగించడం, పాడుబడిన ఇండ్లు కూల్చడం, వార్డు పరిసరాలలో ఉన్న ముండ్ల పొదలు తొలగించడం లాంటి ఏండ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు తీర్చడం జరిగింది. ఇంత మంచి పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ మూడవ విడుత పట్టణ ప్రగతితో కూడా ఇంకా మిగిలి ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకొని మన 7వ వార్డును మడుపల్లి గ్రామాన్ని అలాగే మధిర మున్సిపాలిటీని అభివృద్ధిలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, ఏ ఎన్ ఎం సునీలా, వార్డు సభ్యులు  యేసుపోగుసేనావతి, నండ్రుగురవమ్మ, యేసుపోగు బుజ్జమ్మ, యేసుపోగు. వరమ్మ, మేరుగు. మరియమ్మ, మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ఇంచార్జి వెంకట్ పాల్గొన్నారు.13 వ వార్డులో. పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం. ఈరోజు మధిర మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్ బిక్కి అనితఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్ రు మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు 13 వార్డ్ నందు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ వార్డ్ కమిటీ సభ్యులు మరియు వార్డ్ ప్రజలు ఆశ వర్కర్ మరియు RPలు మునిసిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమము ప్రారంభం ఈరోజు మూడోవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమములో భాగముగా మొదటి రోజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో  పట్టణ ప్రగతి కార్యక్రమమును ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత 19వ వార్డు కౌన్సిలర్ మాధవి 18వ వార్డు కౌన్సిలర్ రజిని వార్డు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అంబటి రమాదేవి. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ లు, మున్సిపల్ మేనేజర్ రవీంద్ర, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్, వార్డు ఇంచార్జ్ లు, మెప్మా ఆర్పీ లు, కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు మరియు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.