*మాతృమూర్తులకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* -సామాజిక ఉత్పత్తిలో మహిళలను భాగస్వామ్యం చ

Published: Thursday March 09, 2023

చేవెళ్ల మర్చి 8, (ప్రజా పాలన):-


రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రం మార్కెట్ యార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల భారత జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి  పైమీధ బేగం సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై ఎన్ ఐ ఎస్ డబ్ల్యు జెండాను మహిళలతో కలిసి  ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
అమెరికా దేశంలో కర్మగారాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలు ఒకరినొకరు కూడబెల్కొని సంఘటితం  అయ్యారని 1845 లో 16 గంటల నుండి పది గంటలకు పని తగ్గించాలని కోరుతూ సమ్మె నెలరోజులపాటు సాగిందన్నారు.
ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని యాజమాన్యం ప్రయత్నించిందని తెలియజేశారు 18 57 న్యూయార్క్ నగరంలో ఆకలితో చస్తూ బతికే కన్నా పోరాటంలో చావడం మేలని భావించి బట్టల మిల్లులో పనిచేసే మహిళా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసి విజయాన్ని సాధించారని ఆయన తెలియజేశారు.అనేక దేశాల్లో హక్కుల కోసం ర్యాలీలు జరిగాయి అన్నారు. అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరపాలని 1910 ఆగస్టు 26 27 తేదీల్లో డెన్మార్క్ రాజధాని హీగన్ లో మహిళా సదస్సు జరిగింది.అని 17 దేశాల నుండి దాదాపు 100 మంది ప్రజలు హాజరయ్యారని ఆ సమావేశంలో మార్చింది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని తీర్మానం చేయడం జరిగింది. ఆ పోరాటాల స్ఫూర్తితో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు బిజెపి ప్రభుత్వం పక్కన పడేసిందన్నారు నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష అసమానతలు హింసపై పోరాటాలు చేయాలన్నారు. పరిశ్రమల్లో మహిళల పరిస్థితి దీనంగా ఉందని ఉద్యోగ భద్రత కనీస వేతనాలు లేవని వాటిపై  పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ భారతదేశంలో నిమిషానికి 16 మంది ఆడవారి పైన హత్యాచారాలు జరుగుతున్నాయంటే ఈ పాలక పక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని అదేవిధంగా దళితులపై దాడులు పెరిగాయని బేటి పడావో బేటి బచావో అనే నినాదం దేశంలో ఎక్కడ పనిచేస్తుందో తెలుపాలని ఆయన బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఐక్యమత్యంగా ఉండి హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిలు వడ్ల సత్యనారాయణ జైపాల్ రెడ్డి ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ ప్రజానాట్యమనేది జిల్లా గౌరవ అధ్యక్షులు సుభాన్ రెడ్డి  చేవెళ్ల సిపిఐ పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్ గండిపేట్ మండల కార్యదర్శి బాబురావు శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి మండల మహిళా సంఘం నాయకురాలు మాధవి, విజయమ్మ మీనాక్షి సాయిల్ అమ్మ అనసూయ సిపిఐ సీనియర్ నాయకులు డాక్టర్ షౌరీలు గీత పని వాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ బి ఓ సి నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు