జెడ్పి పాఠశాలలకు అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ జారి: జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్

Published: Wednesday February 24, 2021

జగిత్యాల, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న హై స్కూల్స్ లక్ష్మీదేవిపల్లె, శేఖల్ల, పొలాస, ఓబులపూర్, చెప్యాల పాఠశాలలకు ఇంగ్లీష్ మీడియం బోధన తరగతులకు సంబంధించిన అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ ను జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ జారిచేశారు. వసంతసురేశ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులను రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కరోనా కారణంగా పాఠశాలలో పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ సీఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.