కెసిఆర్ కు రైతుల సంక్షేమమే ముఖ్యం.

Published: Tuesday February 01, 2022

వెల్గ టూర్, జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలం గుల్లకోటలో 1258000 రూపాయలతో అభివృద్ధి పనులు, భూమిపూజ తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ తో కలిసి సోమవారం రోజు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కె.సి.ఆర్ రైతుల సంక్షేమమే ముఖ్యమని ఇందు కోసం రైతుబంధు, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కే.సీ.ఆర్ కు దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచింది మంత్రి అన్నారు. జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి ప్రోగ్రాము ద్వారా తడి పొడి చెత్త వేరు చేసి మురుగునీటి కాల్వల ఎప్పటికప్పుడు శుభ్రపరచి పల్లె ప్రకృతి వనం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎంతో దోహదం చేసిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మీ లింగయ్య, జెడ్ పి టి సి బి సుధారాణి రామస్వామి, సహకార సంఘం అధ్యక్షులు గూడా రామ్ రెడ్డి, ఏలేటి కృష్ణా రెడ్డి, సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, రొతు సమనవ్య అధ్యక్షులు చుక్కా శంకర్రావు, ఎంపీటీసీ శ్రీజ మల్లేశం, తె.రా.స అధ్యక్షులు మంల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్, కర్యాదర్షి జుపాక కుమార్, లచ్ఛిరెడ్డ, గాగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, బాల్ సాని రవీ, యువత అధ్యక్షులు బిడారి తిరుపతి, కొటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణరావు, పత్తి పాక వెంకటేష్, రంగు తిరుపతి గౌడ్, డాక్టర్ జగదీష్, పడిదం బుచ్చమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.