నిరు పేదలకు అండ దండ తెలంగాణ వికాస సమితి

Published: Friday June 04, 2021
బాలపూర్, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : కరోనాను తరిమి కొట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని (తె. వి. స) జిల్లా అధ్యక్షులు నక్కేరితి  శ్రీనివాస చారి పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు గురువారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ..... కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు చేయూతను ఇస్తున్నామని, పేదవారికి నిత్య అవసర వస్తువుల పంపిణీ కార్యక్రమన్ని ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నక్కెరితి శ్రీనివాస్ చారి తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరు వేణుగోపాల్ మాట్లాడుతూ  పేద వారిని గుర్తించి కరోన మహమ్మారితో ఇబ్బంది పడుతున్న వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా బట్టలు దుప్పట్లు భోజన వసతులు ఇతర వస్తువులు మనిషికి ముఖ్యంగా కావలసినవి కూడు, గుడ్డ, నీరు, వంటివి అందిస్తే వారి జీవనం సాగిపోతుంది అని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కంఠం సైదులు మాట్లాడుతూ..... ఆ పథకాల సమయంలో మేమున్నామంటూ, తెలంగాణ వికాస్ నుండి నిరుపేదలైన కుటుంబాలకు చేయూత ఇస్తున్నామని బియ్యము, పప్పు, మంచి, నూనె, చింతపండు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, గోధుమపిండి, ఉప్పు, తదితర వస్తువులు అందజేశారాని తెలిపారు. కరోన మహమ్మారి కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న కుటుంబాలను ముందుండి ఆదుకోవడంలో తెలంగాణ వికాస సమితి ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి వికాస సమితి ముందుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ ఉపయోగించలని, టీకాలు వేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా వేసుకుంటే వారి కుటుంబాన్ని రక్షించు కున్న వారవుతారని తెలపడం జరిగిందన్నారు. మహమ్మారినీ తరిమికొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.