ఉపాధి హామీ పనులు జరిగే చోట నేమ్ బోర్డు ఉండాలి

Published: Monday August 23, 2021
డిఆర్డిఏ ఏపిడి లక్ష్మి కుమారి
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్ట్ ప్రజాపాలన : ఉపాధి హామీ పనులు జరుగు ప్రతి చోటా నేమ్ బోర్డులు ఉండాలని డిఆర్డిఏ ఏపిడి లక్ష్మి కుమారి సూచించారు. ఆదివారం వికారాబాద్ నియోజక పరిధిలో గల మర్పల్లి మండలానికి చెందిన కొత్లాపూర్, బూచన్పల్లి గ్రామాలలో కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భాన్ని ఆమె మాట్లాడుతూ.. నర్సరీ, పల్లె ప్రకృతి వనం దగ్గర నేమ్ బోర్డడులను ఏర్పాట  చేేయాలని పేేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్, పల్లెె ప్రకృతిని పరిశీలించారు. పెద్ద బోర్డపై టెక్నికల్ అసిస్టెంట్, కార్యదర్శుల పేర్లు, ఉపాధి హామీలో పని చేసిన లేబర్ పని దినాలు మెటీరియల్ ఎక్స్ పెండీచర్, వన సేవకుని, టిఎ పేర్లు రాయాలని ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్, ఈసి విఠల్, టిఎ విష్ణు సర్పంచ్ ప్రభాకర్, నాయకులు బూచన్ పల్లి  మధు తదితరులు పాల్గొన్నారు.