అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల బ్

Published: Wednesday November 09, 2022

జిల్లాలో సరైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గోదావరి నది నుండి సరైన అనుమతులు, రసీదులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని 8, 12 నంబర్లు గల చౌకధరల దుకాణాలను సందర్శించి స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నరుకులను పంపిణీ చేయాలని, చౌక ధరల దుకాణంలో అందించే నరుకుల వివరాలను సూచిక బోర్డులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందించే నరుకులు సకాలంలో లబ్దిదారులకు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, డీలర్లు నిర్ణీత గడువులోగా డి.డి. చెల్లించి నరుకుల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజన్వ మండల అధికారి వేణు, మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.