ఇంటర్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు స్వీకరణ.

Published: Wednesday June 16, 2021
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. రవీందర్రెడ్డి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 15, ప్రజాపాలన : జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ ఇంటర్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కోసం మార్చి-2021లో 10వ తరగతిలో జి.పి.ఎన్. 7.0, ఆపై ఉత్తీర్ణులైన ఎన్.సి., ఎన్.టి., బి.సి., ఈ.బి.సి., మైనార్టీ, వికలాంగ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.రవీందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుండి 30వ తేదీ లోగా ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సి.జి.జి. ఆన్లైన్ ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా జూలై 3వ తేది న విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపిక చేయబడిన విద్యార్థుల ధృవపత్రాలను జూలై 5వ తేదీన పరిశీలించి ఆలట్మెంట్ ఆర్డర్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు మీ సేవలో తీసుకున్న కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, అభ్యర్థులు వికలాంగులైతే ధృవీకరణ పత్రం, 4 నుండి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివిన స్టడీ సర్టిఫికెట్లు, హాస్టల్ బోనఫైడ్ (ప్రభుత్వ ఎన్.సి., ఎన్.టి., బి.సి., హాస్టల్ విద్యార్థులకు), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.