ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే నలుగురు మహిళలు మృతి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్*

Published: Thursday September 01, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని దీనికి కేసీఆర్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి బాధిత కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు గుడ్ల అర్జున్ అన్నారు.తుర్కయాంజల్ లో ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైదుల నిర్లక్ష్యం కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మరణించడం చాలా బాధాకరమన్నారు నిర్లక్ష్యం వహించి అమాయక మహిళల ప్రాణాలను తీసిన డాక్టర్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ,ప్రభుత్వ ఉద్యోగం,డబుల్ బెడ్రమ్ ఇల్లు,వారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని యెడల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎతున్న ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు*