పేద విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో వైద్యవిద్యను సాకారం చేస్తున్న కిరిగిస్తాన్ మెడికల్ యూ

Published: Tuesday September 20, 2022
వైద్య విద్య కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ పరీక్ష రాసి సీటు సంపాదించని వారికి అతి తక్కువ ఖర్చుతో,వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న వారికి  కిరిగిస్తాన్ లోని చారిత్రక వైద్యకళాశాలలో అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు వింగ్స్ కన్సల్టెన్సీ సి ఈ ఓ భాను ప్రకాష్ .
అమీర్ పేట లోని సితార హోటల్ లో జరిగిన సమావేశంలో కిరిగిస్తాన్ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య
విద్య కోసం కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా అతి తక్కువ ఖర్చుతో,అత్యున్నత ప్రమాణాలతో మీ స్వప్నాన్ని సాకారం చేసుకునే సదవకాశాన్ని దశాబ్దాల చరిత్రకలిగిన కిరిగిస్తాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కల్పిస్తోంది అని తెలిపారు.అనుభవజ్ఞులైన ఫాకల్టీ తమ  సొంతమని అన్నారు.
కిరిగిస్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీకి దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. అనేక మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుని కిరిగిస్తాన్ వైద్యకళాశాలలో తీర్చి
దిద్దుకున్నారు. వారిలో ఎందరో ఇప్పుడు ఇండియాలో తమ పవిత్ర వృత్తి బాధ్యతలు
నిర్వర్తిస్తున్నారన్నారు.
 
కిరిగిస్తాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రత్యేకతలు
 
1. ఆనాటి రష్యా ప్రభుత్వం కిరిగిస్తాన్లో 1939లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి
అంకురార్పణ చేసింది.
2. 11 విభాగాల్లో ఉన్నత వైద్య విద్యావకాశాలు ఈ కళాశాల ప్రత్యేకత.
3. 80 విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యావకాశాలు
4.80 ప్రత్యేక విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యావకాశాలు.