వచ్చే ఎన్నికల్లో మా పార్టీ క్రియాశీలకంగా మారుతుంది.

Published: Saturday June 11, 2022
జన సైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
... జనసేన పార్టీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి సైదల శ్రీనివాస్.
 
మంచిర్యాల బ్యూరో, జూన్10, ప్రజాపాలన:
 
తెలంగాణ రాష్ట్రం లో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ  క్రియాశీలకంగా మారనుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని జన సైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి సైదల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని ఒక పంక్షన్ హాల్ ల్లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల కార్యకర్తలకు ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు  కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షుడు తన్నీరు మదు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 890 సభ్యత్వం నమోదు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు ప్రజలు ముందుకు వస్తున్నారని  పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యార్థులు పోటీకి నిలబడేలా ఎదగాలని కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వం పొందిన ప్రతీ కార్యకర్తలకు ఐదు లక్షల జివితబీమా కల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కు చెందిన వివిధ నియోజకవర్గాల  నాయకులు మాయ రమేష్, శ్రీనివాస్, కళ్యాణ్  తదితరులు పాల్గొన్నారు.