డాక్టర్ తాల్క నర్సింగ్ రావు తల్లి దశ దినకర్మ

Published: Friday August 27, 2021
యాదాద్రి, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : డాక్టర్ తాల్క నర్సింగ్ రావు  ప్రముఖ ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడు తల్లి గారి దశ దినకర్మ తేదీ: 27.08.2021 శుక్రవారం రోజున మధ్యాహ్నం 1.00 గంటకు స్వగ్రామం మాటూరు లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తాల్క వెంకటయ్య తాల్క నర్సమ్మ దంపతులకు ఆరుగురు మగ సంతానం. డాక్టర్. తాల్క నర్సింగ్ రావు ప్రముఖ ఎముకల శస్త్ర చికిత్స నిపుణులు, తాల్క రాములు యస్.సి, యస్.టి. విజిలెన్స్  కమిటీ మెంబర్ మరియు మీడియా, తాల్క లక్ష్మన్ రుద్రమాదేవి మాక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జనగాం, తాల్క శత్రజ్ఞ (బాబు) ప్రముఖ రాజకీయ నాయకులు తాల్క ట్రస్టు ప్రతినిధి, తాల్క అంజయ్య పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ యస్.సి., యస్.టి. ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. కీ.శే. తాల్క భరత్ కుమార్ జ్ఞాపకార్థంగా 1986వ సంవత్సర నుండి ఇప్పటి వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తండ్రి కీ.శే.తాల్క వెంకటయ్య తేదీ:11-09-2007 మంగళవారం స్వర్గస్తులైనారు. తల్లి తాల్క నర్సమ్మ 14 సంవత్సరాల తరువాత తేది :18-08-2021 బుధవారం నాడు అనారోగ్యంతో స్వర్గస్తులైన సంగతి తెలిసినదే. తల్లి దశ దినకర్మ తేదీ: 27-08-2021 శుక్రవారం మధ్యాహ్నం: 01.00 గంటకు స్వగ్రామం: మాటూరు, మండలం: మోటకొండూర్, జిల్లా: యాదాద్రి - భువనగిరి లో నిర్వహిస్తున్నామని ప్రజాపాలన ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. తామెల్లరు  వచ్చి తమ తల్లి  ఆత్మకు శాంతి చేకూర్చగలరని  కుమారులందరు ప్రార్థిస్తున్నామని తెలిపారు