రాబోయే వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని నాల పనులను పూర్తి చేయాలి : విప్ గాంధీ,

Published: Tuesday February 22, 2022
జోనల్ కమిషనర్ ప్రియాంక అలా ఐ ఏ ఎస్
శేరిలింగంపల్లి -ప్రజాపాలన /న్యూస్ :డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ నాల విస్తరణ లో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులను జోనల్ కమిషనర్ ప్రియాంక అలా ఐ ఏ ఎస్, జీహెచ్ఎంసీ అధికారులు మరియు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. రాబోయే వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, అదేవిధంగా రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు , నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతిని, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు