రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలి

Published: Monday October 10, 2022
జిల్లా టిజెఏసి చైర్మన్ ముకుంద నాగేశ్వర్
వికారాబాద్ బ్యూరో 9 అక్టోబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా పరిధిలోగల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని జిల్లా టీజేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ డిమాండ్ చేశారు.
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పరిగిలో ఒక  కార్యక్రమంలో మాట్లాడుతూ  వికారాబాద్ జిల్లా నుండి రాష్ట్ర రాజకీయాలను శాసిద్దాం. అదేవిధంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరపున బీఫాం ఇచ్చేది నేనే. గెలిచి అధికారంలోకి వద్దాం. అభివృద్ధి చేసుకుందాం అంటున్న ఆలోచన మంచిదే. కాని  రేవంత్ రెడ్డి వాస్తవంగా తెలంగాణలో గెలిచి రాజకీయాలను శాసించాలంటే 119 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వుడు స్థానాలు హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ గెలుస్తున్న  ఆరు, ఏడు స్థానాలు పోను మిగిలిన స్థానాలలో అత్యధిక జనాభా ఉన్న బిసిలకు కనీసం జనాభా ప్రాతిపదికన 60 ఎంఎల్ఏ స్థానాలు, 8 ఎంపి స్థానాలు కేటాయిస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రస్తుత వికారాబాద్ జిల్లాకు చెందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి వికారాబాద్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పోను మిగిలిన మూడు నియోజకవర్గాలలో తప్పకుండా రెండు నియోజకవర్గాలను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే బాగుంటుంది. అందులో భాగంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంఎల్ఏ గా బిసి అభ్యర్థికి కేటాయించని పరిగి ఎంఎల్ఏ నియోజకవర్గాన్ని, చేవెళ్ల ఎంపి స్థానాన్ని తప్పకుండా బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ప్రజలు కచ్చితంగా గెలిపించడానికి ఆలోచిస్తారు.
తెలంగాణా శాసనసభలో ఎంఎల్ఏ లు సమస్యలపై ప్రశ్నించట్లేదు. ప్రశ్నించాలని అంటున్న మీరు 2018లో మీపార్టీ నుండి గెలిచిన ప్రశ్నించాల్సిన మెజారిటీ ఎంఎల్ఏ లు అధికారపార్టీలో చేరి అధికారాన్ని అనుభవిస్తున్న మీరు, మీపార్టీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండడం బాధాకరం.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రశ్నిస్తున్న మీరు గతంలో ప్రస్తుతం మీరున్న పార్టీ నుండి మంత్రిగా 2008లో శంకుస్థాపన చేసిన ప్రస్తుత జిల్లా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా మీ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలోకి వెళ్లి మంత్రి పదవిలో ఉండి ఎందుకు చేయలేదో ఆమెను ప్రశ్నించక పరిగి ప్రజలపై నిందలు వేయడం బాధాకరం.
కావున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చట్టసభలలో జనాభా ప్రాతిపదికన బిసి అభ్యర్థులకు ప్రాతినిత్యం కల్పించేందుకు కృషిచేయాలని కోరుతున్నాము.