రైతుల సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

Published: Friday November 25, 2022

బోనకల్, నవంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:- రైతు ప్రజా సమస్యలపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోగురువారం పెద్దఎత్తున రైతు నిరసన కార్యక్రమం చేపట్టారు.మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి దుర్గారావు, ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నిరసన యాత్రలో నాయకులు కార్యకర్తలు భారీ జన సమీకరణతో మండల తాహసిల్దార్ కార్యాలయం చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం తహశీల్దార్ రావూరి రాధికకు రైతులు పడుతున్న పలు సమస్యలతో కూడిన వినతపత్రాన్ని అందజేశారు. అనంతరం పైడిపల్లి కిశోర్ కుమార్ మాట్లాడుతూ రైతు సమస్యలు పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని,కేవలం రైతుబంధుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఇంతవరకు రైతు రుణమాఫీ లేదని, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. అనంతరం కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేసిందని, బలహీనవర్గాలకు భూ యజమాని హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. ధరణి పోర్టల్ లోప భూయిష్టంగా తీసుకువచ్చారనీ, దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు తీరని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ గూగులోతు రమేష్,మధిర నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉమ్మినేని రమేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు కందుల పాపారావు,మండల ఎస్టీ సెల్ నాయకులు బానోతు శ్రీనివాసరావు,బోనకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరిదు శ్రీను, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా భద్రు నాయక్, సేవదల్ మండల అధ్యక్షుడు చింతేటి సురేష్, యువజన కాంగ్రెస్ నాయకులు హేమూన్, పున్నారావు, జనప్రియ కుమార్,అవినాష్, శ్రీపాటి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.