రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అర్హులైన దివ్యాంగులు నిర్ధారణ పత్రాలు అందజేయాలి

Published: Saturday December 31, 2022
మంచిర్యాల మండల తహసిల్దార్ రాజేశ్వర్
 
మంచిర్యాల బ్యూరో,   డిసెంబర్ 30, ప్రజాపాలన :
 
 
ప్రభుత్వం పేదవారికోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితాలో ఉన్న అర్హులైన దివ్యాంగులు జనవరి 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా వారి సదరం / అంగవైకల్య నిర్ధారణ పత్రాలను మండల తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని మంచిర్యాల మండల తహసిల్దార్ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల మండల పరిధిలో రెండు పడకగదుల పథకంలో లబ్ధిదారుల ఎంపిక కొరకు మీ సేవ నుండి 2 వేల 958 దరఖాస్తులు రాగా వీటిపై విచారణ జరిపి, అభ్యంతరాలు స్వీకరించి 27 మంది అనర్హులను గుర్తించడం జరిగిందని, 1 వేయి 621 మంది అర్హుల తుది జాబితాను తయారు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇట్టి జాబితా నుండి దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.