కాశెట్టి లక్ష్మి 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం

Published: Monday May 03, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజా పాలన : పదిమందికి సహాయం చేయాలనే సేవా దృక్పథం తో మనవలు, మనుమరాళ్ళు  కి"శే కాశెట్టీ లక్ష్మి వర్ధంతి పురస్కరించుకొని మాతృదేవోభవ ఆశ్రమంలో విశేష అన్నదానం నిర్వహించారు. బాలపూర్ మండలం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి అనాధల, అభాగ్యుల మాతృదేవోభవ ఆశ్రమంలో కి"శే కాశేట్టి లక్ష్మి గారి ఆరో వర్దంతి జ్ఞాపకార్థంగా ఆమెను స్మరించుకుంటూ మెర్సీ ట్రస్ట్ చైర్మన్ కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశెట్టి వసంత కుమార్ దంపతులు వారి మనవడు డాక్టర్ క్రాంతి కుమార్, మనవరాలు లక్ష్మీ గార్ల ఆధ్వర్యంలో పదిమందికి సహాయం చేయాలనే సేవా దృక్పథంతో మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు  వంట వండుకోవడానికి సంవత్సరం సరిపడా వంట కలపను శనివారం నాడు అందజేసి విశేష అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయన మాట్లాడుతూ.... ఇలాంటి అభాగ్యులకు మన వంతు సహాయ సహకారాలు అందించాలని,ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టి గిరిని పలువురునీ అభినందించారు. ఈ అభాగ్యుల మధ్య జరుపుకుంటున్న అందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ కాపు సంఘం తెలంగాణ అధ్యక్షులు, కాశెట్టి  కుటుంబ సభ్యులతో పాటు, తదితరులు పాల్గొన్నారు.