దాన్యం కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో

Published: Wednesday November 17, 2021
యాదాద్రి నవంబర్ 16 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన దాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని,ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప రైతులు పండించిన దాన్యం కొనుగోలు చేయడం లేదని, మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లోని దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించి వారం రోజులు అవుతున్నప్పటికీ నేటికి కొనుగోలు చేయడం లేదని వారన్నారు. ఇప్పటికైనా స్పందించి రైతులు అకాల వర్షాలకు నష్ట పోక ముందే అన్ని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయాలని, వర్షాల వల్ల రైతులు చాలా నష్టాలు పాలవుతున్నారని, వెంటనే కొనుగోలు చేయలేక పోతే రైతులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు భొల్ల శ్రీనివాస్, నాయకులు లింగయ్య, పబ్బు సురేందర్, కాసుల వెంకన్న, గరీసే రవి, పాలకూర వెంకటేశం, వార్డు మెంబర్లు ఎమ్మెస్ శేఖర్, బత్తిని రవి, మంగ రాములు, ఎమ్మె లక్ష్మయ్య, మల్లేశం, మల్లికార్జున, నరసింహ, తిరుపతయ్య, చింటు, ధనంజయ, సాయిలు, బండి నరసింహా, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.