దెందుకూరు ఖమ్మంపాడులో మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమం

Published: Tuesday March 08, 2022
మధిర మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దెందుకూరు గ్రామంలో సోమవారం నాడు పిహెచ్సి పరిధిలో ఉన్న అన్ని సబ్ సెంటర్స్ లో వైద్యులు డా శశిధర్ ఆధ్వర్యంలో వివిధ పారా మెడికల్ సిబ్బంది ద్వారా మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమం అనగా సంపూర్ణముగా అన్ని టీకాలు క్రమపద్ధతిలో వేయుంచుకొని పిల్లలను మరియు గర్భిణీ స్త్రీ లను సర్వే ద్వారా గుర్తించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా వారికీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి స్థానిక ఎఎన్ఎమ్ ఆశ  అంగన్వాడీల ద్వారా డ్రాపౌట్ పిల్లలకు సంపూర్ణ వ్యాది నిరోధక టీకాలు వేయుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది పిహెచ్ఎన్ రమాదేవి  హెచ్ఈఒ సనా గోవింద్ పిహెచ్సి పరధిలో అన్ని హెల్త్ సబ్ సెంటర్స్ ప్రోగ్రాం మానిటరింగ్ చేయగా దెందుకూరు ఖమ్మంపాడు సబ్ సెంటర్స్ను హెచ్ఎస్ లంకా కొండయ్య, మధిర మరియు సబ్ సెంటర్స్ ను హెచ్ఎస్ సుబ్బలక్ష్మి మరియు మడుపల్లి మహాదేవపురం హెల్త్ విజిటర్ బి కౌసల్య  పర్యవేక్షణ చేస్తున్నారు. హెల్త్ అసిస్టెంట్ లు నాగేశ్వరరావు జి శ్రీనివాస్ రావు ఎఎన్ఎమ్ లు జయమ్మ భారతి, విజయకుమారి, విజయలక్ష్మి, సిహెచ్ విజయ కుమారి, అరుణ, రాజేశ్వరి, నాగమణి, సునీలారాణి వై లక్ష్మి ఆశ కార్యకర్తలు అంగన్వాడీ లు పాల్గొన్నారు.