కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి

Published: Monday May 02, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 1 ప్రజాపాలన ప్రతినిధి : మేడే కార్యక్రమాలలో పెండ్యాల బ్రహ్మయ్య మాల్ మార్కెట్ కేంద్రంలో, యాచారం మండల కేంద్రంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1886లో అమెరికాలో చికాగో నగరంలోని హే మార్కెట్ లో ఎనిమిది గంటల పని దినాలు కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కనీస హక్కుల కోసం కార్మిక వర్గం వీరోచితమైన పోరాటం చేస్తున్న క్రమంలో ఆనాటి పాలక వర్గం యజమానుల తొత్తులుగా మారి పోలీసులు చేత ఆరుగురు కార్మిక నాయకులను కాల్చి చంపారు వీర మరణం చెందిన కార్మిక నాయకుల రక్తం  ఏరులై పారుతున్న క్రమంలో రక్తపుమడుగులో నుంచే పుట్టిన కార్మికుల దినం మేడే ఎర్ర జెండాను ఎగురవేసిన చరిత్ర ఉంది అని అన్నారు పోలీసుల కాల్పుల్లో వేలాది మంది కార్మికులకు గాయాలయ్యాయి అనేకమందిని అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురిచేసిన పరిస్థితి ఉంది ఆ పోరాట ఫలితంగానే ఎనిమిది గంటల పని దినాలు కార్మికులకు కనీస వేతనాలు హక్కులను సాధించుకోవడం జరిగింది అందుకోసమే ప్రతి ఏటా మేడే వారోత్సవాలను కార్మిక వర్గం విజయవంతం చేసుకుంటున్న అటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కార్మిక హక్కులను కాలరాయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల కోసం వారి తాబేదార్ల కోసం కార్పొరేట్ శక్తుల లాభాల కోసం కార్మికుల హక్కులను కాలరాస్తూ దేశ ఆర్థిక  సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేస్తూ ఎనిమిది గంటల పని దినాలను రద్దు చేస్తూ వేతనాల పెంపుదల యూనియన్ల భాగస్వామ్యం లేకుండా 40 రకాల కార్మిక కో డ్ ల ను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తోంది అలాగే నిత్యావసర సరుకుల ధరలను అడ్డూ అదుపు లేకుండా పెంచి కార్మిక వర్గాన్ని సామాన్య ప్రజానీకాన్ని దుర్భరమైన జీవితాలు గడిపీస్తున్న ప్రభుత్వాలు ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది అన్నారు అలాగే మేడే స్పూర్తితో ప్రతి కార్మికునికి నెలకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని పోరాడి సాధించుకున్న హక్కులను సాధించే అంత వరకు పోరు సాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.మాల్ మార్కెట్ లో హమాలీ కార్మికులు .గ్రామపంచాయితీకార్మికులు. భవన నిర్మాణం కార్మికులు. ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ కార్మికులు. బోర్ మెకానిక్ యూనియన్ కార్మికులు. మార్కేట్ హమాలీలు. నజ్జిక్ సింగారం లో భవన నిర్మాణ కార్మికులు. యాచారం మండల కేంద్రంలోసిఐటియు. జేండాలు ఆవిష్కరణ కార్యక్రమాలు. ర్యాలిలు. సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సతీష్. గోపాల్ అరుణ్. బాలరాజు. జాహంగీర్. శ్రీశైలం. దేవెందర్. సత్యం. జంగయ్య. రాములు. వెంకటయ్య. నజీర్. రామాచారి. సోమయ్య. అగామ్మ. వెంకటేష్. యాదయ్య. లక్ష్మయ్య. రాములు. రాజు. రమేష్. యాదయ్య. నర్సింహ. ప్రదిప్. పద్మ. యాదయ్య కృష్ణ మైసమ్మ పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.