ప్రజలువిలువలతో కూడిన విద్యను అభ్యసించండి.

Published: Monday March 21, 2022
మధిర మార్చి 19 ప్రజాపాలన ప్రతినిధి : సంస్కారవంతమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. నిరంతరం చదువుతూ శ్రమిస్తేనే సక్సెస్ సాధించ వచ్చు. భరత్ విద్యాసంస్థల వీడ్కోలు సభలో మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ నిరంతరం శ్రమిస్తూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు శనివారం వార్తక సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమశిక్షణ కలిగి చదువుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిరంతరం చదువుతూ ఉంటే మీ జీవితంలో సక్సెస్ అవుతారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ విద్యాసంస్థల డైరెక్టర్లు శిలం వెంకట రెడ్డి విద్యా లత, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకార్, యనమల రామలింగారెడ్డి, ఎం ఈ ఓ వై ప్రభాకర్ బుషా కోటేశ్వరరావు, టీవీ రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు బ్రహ్మారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ లు మాధవి అరేగా రజిని, గద్దల మాధురి, జింకల కోటేశ్వరరావు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.