అక్రమ రవాణా నివారణే లక్ష్యం

Published: Friday January 28, 2022
జిల్లా ఎస్‌పి ఎన్. కోటి రెడ్డి, ఐపిఎస్
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : అసాంఘిక కార్యక్రమాల నివారణే లక్ష్యంగా నాకాబందీ ఏర్పాటు చేయనున్నామని జిల్లా ఎస్ పి ఎన్.కోటిరెడ్డి ఐపిఎస్ అన్నారు. అక్రమ ఇసుక, రేషన్ బియ్యం రవాణా, ప్రభుత్వ నిషేధ  గుట్కా, గంజాయి, రాత్రి సమయంలో దొంగతనాలు, అక్రమ ట్రాన్స్పోర్ట్, పేకాట మరియు మట్కా మొదలగు అసాంఘిక కార్యక్రమాలపై నాకాబందీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపడం జరుగుతుందని జిల్లా ఎస్‌పి హెచ్చరించారు. ఇందుకుగాను జిల్లా ప్రజలు కూడా సహకరించగలరని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎస్పి ఆధ్వర్యంలో నెలకు రెండు లేదా మూడు సార్లు ఈ నాకాబందీ చేయాలని జిల్లా ఎస్పీ సంభందిత అధికారులకు ఆదేశించడం జరిగింది. దీనికోసం కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. నాకాబందీకి సంబందించిన వివరాలను క్రింద తెల్పడం జరిగింది. నాకాబందీని జిల్లా పోలీసు అధికారులు ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు, కావున జిల్లా ప్రజలందరూ తన దగ్గర వాహనాలకు సంభందించిన సరైన పత్రాలు మరియు  గూడ్స్ వాహనదారులు, గూడ్స్ కి సంబంధించిన సరైన పత్రాలు పెట్టుకోవాలి. ఇదివరకె జిల్లాలోని మోమిన్ పేట్, కరణ్ కోట్, బషీరాబాద్, పెద్దేముల్ మరియు యాలాల్ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో మొదటి సారి మరియు మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ లలో నాకాబందీ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నాకాబందీ కార్యక్రమంలో అక్రమ  ఇసుక, రేషన్ బియ్యం రవాణా, గంజాయి, గుట్కా మొదలకు ప్రభుత్వ నిషేధ వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాకాబందీ కార్యక్రమంలో అనుమానిత వ్యక్తులను మరియు రాత్రి సమయాలలో అనుమానాస్పదంగా ఉన్న వారిని, డ్రంక్ & డ్రైవ్ చేసే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. 
•జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో నాకాబందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగును. మొదటి సారి నాకాబందీ చేసి వికారాబాద్ టౌన్ లో 133 కరణ్ కోట్ లో 79 బషీరాబాద్ లో 32 పెద్దేముల్ లో 30  మరియు యాలాల్ లో 70 మొత్తం 344 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. రెండవ సారి నాకాబందీ చేసి క్రింది విధంగా వాహనాలు సీజ్ చేసినారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో నాలుగు ప్రాంతాలలో నాకబంధీ ఏర్పాటు చేసి మొత్తం 429 వాహనాలను తనిఖీ 16 సీజ్ చేయడం జరిగింది. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో 4 చెకింగ్ పాయింట్ లు ఏర్పాటు చేసి  మొత్తం 295 వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. పరిగి పోలీస్ స్టేషన్ పరిదిలో 4 చెకింగ్ పాయింట్ పెట్టి మొత్తం 280 వాహనాలను తనిఖీ  చేయడం జరిగింది. కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిదిలో 4 చెకింగ్ పాయింట్ పెట్టి మొత్తం 63 వాహనాలను తనిఖీ  చేయడం జరిగింది. నాకాబందీలో పట్టుబడిన వాహనాలు వ్యక్తులు లపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా అనుమానం కలిగిన వెంటనే తమ పరిధిలోని పోలీస్ అధికారులకు గాని డైల్ 100 కు గాని ఫోన్ చేసి తెల్పాలని జిల్లా ఎస్‌పి గారు కోరడం జరిగింది.