ఖరీఫ్ సాగు పంటల సర్వే నంబర్ల ఆధారంగా నమోదు వివరాలను సేకరించిన జిల్లా వ్యవసాయ అధికారి పి. సుర

Published: Wednesday September 22, 2021
సారంగాపూర్, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ బట్టపల్లి లక్ష్మీదేవిపల్లి పెంబట్ల కోనపూర్ సారంగాపూర్ తదితర గ్రామాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.సురేష్ ఖరీఫ్ సాగు పంటల పేర్లు నమోదు వివరాలను సర్వే నంబర్ల ఆధారంగా సాగు చేస్తున్న పంటలను పర్యవేక్షించి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల దిగుబడిపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు వారం రోజుల్లో అవగాహన సదస్సులు రైతు వేదికల యందు ఏర్పాటు చెస్తారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసంగి రభిలో పంటల మార్పిడిపై త్వరలో సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తారని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు గురించి విస్తరణ అధికారులు అవగాహన కల్పిస్తారని జిల్లా అధికారి సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల్ రైతుబందు అధ్యక్షుడు కోల శ్రీనివాస్ మండల వ్యవసాయ అధికారి తిరుపతి నాయక్ ఏఈవో ఆంజనేయులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.