*కంటి వెలుగు కార్యక్రమంతో అంధుల జీవితాల్లో వెలుగులు* -కౌకుంట్ల గ్రామంలో కంటి వెలుగు శిబిరాన

Published: Friday February 03, 2023

చేవెళ్ల, ఫిబ్రవరి 02(ప్రజాపాలన):-

తెలంగాణ రాష్ట్రంలో అందత్వ
నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కౌకుంట్ల సర్పంచ్ కండ్లపల్లీ గాయత్రి, ఎంపీటీసీ కావలి సుజాత కోరారు.
గురువారం కౌకుంట్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కౌకుంట్ల గ్రామ సర్పంచ్ కండ్లపల్లి గాయత్రి,ఎంపీటీసీ కావలి సుజాత ఉపసర్పంచ్ అబ్దుల్ ఇనాయత్ లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని అన్నారు. గ్రామాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న పేదల కోసమే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరీక్ష చేయించుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా ప్రభుత్వమే మందులు,కంటి అద్దాలు అందిస్తుందని తెలిపారు. కౌకుంట్ల గ్రామంలో ఈ కంటి వెలుగు శిబిరం ఫిబ్రవరి 14వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దేవేందర్,డాక్టర్లు సుష్మిత,సౌందర్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కండ్లపల్లి గోపాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు కావలి వెంకటేష్ బాబు,మరియు వార్డు సభ్యులు,దొరేటి వసంత,తలారి మహేందర్,ఎండీ గౌస్, వాహబ్,మంగలి శివ,మరియు ఏఎన్ఎం చంద్రకళ, ఆశావర్కర్లు చెన్నగొని లక్ష్మి,కరుణశ్రీ ,రాణి ,డీవోలు హరి,మంజుల,జంగిలి రాజు,కరోబర్ చిలుకల రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.