రేపు జన్నారంలో జాబ్ మేళా

Published: Monday May 16, 2022
జన్నారం రూరల్, మే 15, ప్రజాపాలన: 
 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ని  స్లేట్ హైస్కూల్  లో  ప్రవేట్ రంగంలో ఉద్యోగాలకు ఈ నెల 17 మంగళవారం 
జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని స్లేట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అపోలో పార్మసీలో ఉద్యోగ ఖాళీలు పార్మసిస్ట్ 25, ట్రాన్సి పార్మసిస్ట్ 25, పార్మరీ అసిస్టెంట్ 25, రీటైల్ ట్రాన్సి అసోసియేట్ 25, ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు  సెల్ నెం, 8247656356 తో సంప్రదించాలని తెలిపారు.