టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిత స్థానం : కాకతీయ కమ్మ సేవా సమితి సేవలు అభినందనీయం.

Published: Monday July 12, 2021
మధిర, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీటిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలకు సముచిత స్థానం దక్కిందని హైదరాబాదులోని అన్ని కులాలకు 5 ఎకరాల స్థలం స్థలం కేటాయించటం జరిగిందని దీనిలో భాగంగానే కమ్మ సంఘాన్ని కూడా ఐదు ఎకరాలు భూమి కేటాయించడం జరిగిందని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో గత 48 రోజులుగా కరోనా బాధితులకు భోజన సదుపాయం అందించిన సంగతి విదితమే ఈ సందర్భంగా స్థానిక రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో చెరుకూరి నాగార్జున అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో రావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. మధిరలో కూడా కమ్మ సంఘానికి ప్రభుత్వ స్థలం వచ్చే విధంగా తన వంతు సహకారం అందిస్తామన్నారు. కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కరోన బాధితులకు సుమారు 45 రోజుల పాటు భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు పుతుంభాక శ్రీ కృష్ణ ప్రసాద్, సిపిఎం నాయకులు కట్టా గాంధీ, కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.