లేస్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత ఆప్టిట్యూడ్ శిక్షణ

Published: Thursday August 04, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
అఖిల భారత సర్వీసులైన సివిల్స్, గ్రూప్స్,ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత ఆప్టిట్యూడ్ శిక్షణ ఇవ్వనున్నట్లు లేస్ అకాడమీ డైరెక్టర్ నరసింహ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న అభ్యర్థులకు తమ వంతుగా సహాయం అందించే లక్ష్యంతో తమ సంస్థ ప్రత్యేక యాప్ ను రూపొందించిందని తెలిపారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తాము అందిస్తున్న క్లాసులను పూర్తి ఉచితంగా పొందవచ్చునని చెప్పారు. నియామకాల ప్రక్రియ సమయంలో కొన్ని సంస్థలు అభ్యర్థుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు రాబడుతున్నాయని అలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ వెబ్సైట్ ద్వారా కూడా ఉచిత తరగతులను పొందవచ్చునని తెలిపారు.లైవ్ క్లాసెస్ కు మాత్రమే ఫీజు తీసుకుంటున్నామని, అత్యుత్తమ క్వాలిటీతో ట్రైనింగ్ ఇచ్చే ఏకైక అకాడెమీ గా తమ సంస్థ పేరొందిందన్నారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు ఫ్యాకల్టీ లు అమూల్య రతన్, కె. సుందర్ రావు, ఈ. శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.