జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Published: Wednesday May 05, 2021

-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్.
మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : మధ్యప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గుర్తించిన విధంగానే జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూ జెఎఫ్) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తొట్ల మల్లేష్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా కరోనా వార్తలు సేకరిస్తూ వైరస్ బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 26 మంది జర్నలిస్టులు కరోనా వైరస్ బారినపడి మరణించారని.. అనేక మంది జర్నలిస్టులు వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారని అన్నారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టును ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని కోరారు.