అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: సర్పంచ్ మ

Published: Tuesday February 01, 2022
బోనకల్, జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమం వంగాల నవ్యాంజిలి, తాళ్లూరి త్రివేణి లకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతి రావు మాట్లాడుతూ శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం గర్భిణీ స్త్రీలకు మంచి శుభ సుశికం ఆని మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేందుకు గర్భిణీ స్త్రీలకు పుట్టే బిడ్డ కు ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆనవాయితీగా వస్తున్న శ్రీమంత కార్యక్రమం గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి శ్రీమంతం చేయటం ఆచారంగా వస్తున్న ఆనవాయితీని శాస్త్ర విజ్ఞాన పరంగా కొన్ని మార్పులు చేసుకునేందుకు వస్తున్నా మీ శ్రీమంత ఉత్సాహం ఆరు నెలల తర్వాత గర్భిణీ స్త్రీలకు జరిగే కార్యక్రమం అని భర్తతో పాపిడి తీయించి పూలు పండ్లు స్వీట్లు గాజులు ఇచ్ఛి హారతి ఇచ్చి ఈ శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం సంప్రదాయం అని గుర్తు చేస్తు అదే కార్యక్రమాన్ని మన అంగన్వాడి సెంటర్ లో శ్రీమంత కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, వారిని ఆశీర్వదించి అంగన్వాడీ కేంద్రాలను సర్పంచ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, హుస్సేన్ బీ, గౌరమ్మ ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.