నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా మాత్రమే సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు

Published: Tuesday December 27, 2022

బోనకల్, డిసెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే నని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అన్నారు. మండలంలోని కలకోట గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. . భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో డిసెంబర్ 26న ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అనేక కుట్ర కేసులు ఎదుర్కొని, లక్షలాదిమంది ప్రాణ త్యాగాలతో,ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన ఘనత సిపిఐ దే నని ఆయన అన్నారు. సీపీఐ 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడు,గూడు లేనటువంటి నిరుపేద ప్రజలకు అండగా ఎర్రజెండా ముందు ఉంటుందని వారు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల500 మంది ప్రాణాలు ఇచ్చి, లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీలకు లేదని వారు కొనియాడారు.నేడు పాలకవర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగిస్తూ నిత్యం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్నదని అని తెలిపారు. దేశ సంపదను ఆధాని,అంబానీలకు దోచి పెడుతూ, వారికి రాయితీలు ఇస్తూ రైతులని, కార్మికుల్ని, పేద ప్రజల నడ్డి విరుస్తూ,వారి సంక్షేమాన్ని గాలికి వదిలేయడం సరైనది కాదని ఇప్పటికైనా పాలక వర్గాలు ఉన్నత వర్గాలకు ఊడిగం చేయడం మానుకొని పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాల పాలన కొనసాగించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో యంగల పెద్దరమేష్, యంగల వెంకటమ్మా, ముత్తేష్, కృష్ణ వేణి, మతాంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.