పర్మిషన్ లేని నిర్మాణాల తొలగింపు

Published: Friday July 30, 2021
జగిత్యాల, జులై 29 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణంలో ని  పలు చోట్ల పర్మిషన్ లేకుండా కట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ తేజస్విని, తొలంగించారు. మున్సిపల్ పరిధి లోని ధన్వంతరి నగర్, కొత్త హనుమాన్ వాడలో పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను గుర్తించి తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు జరపవద్దని ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె వెంట మున్సిపల్ సిబ్బంది అరుణ్ ఉన్నారు.