రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ఆర్టీసీ బస్సులు నడపాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం ....బండ

Published: Wednesday November 23, 2022

ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇబ్రహీంపట్నం నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని   బండలేమురు మాజీ సర్పంచ్ పోచమోనీ కృష్ణ కోరారు.
ఈ మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల నగరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కొంగర గ్రామం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ కార్యాలయం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిర్మించడం ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంది. నగరంలో ఉన్న నప్పుడు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ ను వివిధ జిల్లా శాఖల అధికారులను కలిసి సమస్యలను చెప్పుకోవ డానికి పోయిరావలంటే నాన్న తంటాలు పడాల్సి వచ్చేది అన్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు దగ్గరలోకి రావడం మంచిదని అన్నారు. ఇప్పుడు నూతన కలెక్టర్ కార్యాలయానికి పోవాలంటే రవాణా సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులపాలవుతున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రాంతంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ కు పోవాలంటే ఇబ్రహీంపట్నం వచ్చి అక్కడ నుండి బొంగులూరు గేట్, ఔటర్ రింగ్ రోడ్డు పోయి కలెక్టర్ ఆఫీస్ కు పోవాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. నడిచిపోవలసిన పరిస్థితి వస్తుంది. కావున ప్రజల సౌకర్యార్థం ఇబ్రహీంపట్నం డిపో నుంచి ప్రతి గంటకు ఒక బస్సును కలెక్టర్ ఆఫీస్ వరకు నడిపించాలని కోరుతున్నాను. ఇబ్రహీంపట్నం నుండి కలెక్టర్ ఆఫీస్ కు బస్సులు వేస్తే ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం కల్పించిన వారవుతారని అన్నారు. కావున వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి  బస్సులను నడిపించాలని కోరుతున్నట్లు చెప్పారు.