ఎం ఎల్ ఏ రఘునందన్ చారి జన్మదిన వేడుకలు

Published: Wednesday March 24, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : హోరాహోరి లో దుబ్బాక ఎన్నికల్లో నూతన నాంది పలికి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ చారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి 29 వ డివిజన్ కార్పొరేటర్ నీలా రవి నాయక్ (దంపతులు) రఘునందన్ చారి నివాసంలో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు పూల బుగ్గే ఇచ్చి శాలువాలతో సన్మానించి ఇలాంటి జన్మదిన వేడుకలు 100 పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ చారి మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు ఎల్లవేళలా రామదండుల నా వెంబడి ఉన్నంతవరకు అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయాన్ని నిలబడతానని ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు యువకులు నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు, యువకులు అభిమానులు శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు