డి.జి.పి. ని కలిసిన మాలహానాడు అధ్యక్షుడు

Published: Thursday July 08, 2021

హైదరాబాద్ జులై 7 ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో మహేందర్ రెడ్డి డి జి పి ని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య. పంజాగుట్ట అంబెడ్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు పుణ్య భాను ప్రకాష్ మరియు కార్యదర్శి వినయ్ కుమార్ తో కలిసి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ స్థాపన గురించి చర్చించారు. 2019 సంవత్సరం ఎప్రిల్ నాడు పంజాగుట్ట సర్కిల్ లో ప్రతిస్టించిన డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహంను ధ్వంసం చేసినారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలనీ, అదే విధంగా అంబెడ్కర్ గారి నూతన కాంస్య విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని కోరుతు వినతి పత్రం అందజేశారు. మాల మహానాడు, పంజాగుట్ట అంబేడ్కర్ విగ్రహం కమిటీ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులను పరిశీలించి మరియు విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగుల పై ఎస్సీ/ఎస్టీ చట్టం 1989 ప్రకారం అట్రాసిటీ కేసులను నమోదు చేసి, నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారించాలని రాష్ట్ర డి జి పి ని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.