తమకేమైనా జరిగితే తాళ్ల గురజాల పోలీసులే బాధ్యత వహించాలి ... మమ్మల్ని కా పాడాలంటూ విలేకరులను వ

Published: Thursday October 27, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: 
 
 వివిధ హాస్టల్లో శానిటేషన్ పనులు నిర్వహిస్తూ, పందుల పెంపకంతో తన ఒకానొక కొడుకుతో జీవనం కొనసాగిస్తున్న తనను కొంతమంది నన్ను, నా కొడుకుని చంపుతామని బెదిరిస్తూ దాడులు చేస్తున్నారని, అలాంటి సంఘటనలలో మాకేమైనా జరిగితే దానికి బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీసులే, బాధ్యత వహించాల్సి ఉంటుందని ఓ ఒంటరి మహిళ ఉండ్రాళ్ళ పోచమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
బుధవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్బు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె, తన కొడుకు రవి తో పాటు మాట్లాడారు, స్థానిక గురుకుల పాఠశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో తన కొడుకుతో పాటు సానిటేషన్ పనులు చేస్తూ, పందుల పెంపకం చేసుకుంటూ జీవిస్తున్నామని, సుల్తాన్ ప్రవీణ్, సందీప్, సంతోష్, నవీన్, శ్రీ రాముల జంపయ్య, అనిల్, సమ్మయ్య, లు నాపై, నా కొడుకు పై, రాత్రి పగలు తేడా లేకుండా, కత్తులు, బరిశలతో దాడులు చేస్తూ నానా బూతులు తిడుతున్నారని, జరిగిన సంఘటనలపై స్థానిక తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని, తాను పెంచుకుంటున్న పందులను సైతం దొంగతనాలు చేస్తూ ఎత్తుకుపోతున్నారని, ఫిర్యాదులు చేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, నా కొడుకు రవిని కొట్టి సెల్ఫోన్ కూడా గుంజుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మేము చట్టాన్ని గౌరవిస్తూ బ్రతుకుతూ ఉంటే ఆటోలతో గుద్ధి చంపుతామని, వురిపెట్టి చంపుతామని, బీరు సీసాలతో పొడిచి, విష ప్రయోగంతో చంపేస్తామంటూ, నా నా రకాలుగా బెదిరిస్తున్నారని నాకు, నా కొడుక్కు, ఏదైనా ప్రాణాపాయం జరిగితే దానికి పై వ్యక్తులు మరియు తాళ్ల గురజాల పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది.
ఇప్పటికైనా పోలీసులు, మా మొర ఆలకించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, చంపుతామని బెదిరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాల్సిందిగా ఆమె వేడుకొంది.