లారీని ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ ఆర్టీసీ డ్రైవర్, లార

Published: Thursday January 12, 2023
 బోనకల్, జనవరి 11 ప్రజాప్రలన ప్రతినిధి: ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్ ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటూ ప్రాణాల నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులు బయటపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని సీతానగరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏపీ 39 టి 56 56 నెంబర్ గల లారీ జగ్గయ్యపేట నుంచి వైరా వైపు వెళ్తుంది. మధిర డిపో కి చెందిన టీఎస్ 08 జెడ్ 0037 సూపర్ డీలక్స్ బస్సు హైదరాబాదు నుంచి మధిర వెళుతుంది. అయితే మండల పరిధిలోని సీతానగరం గ్రామం లోనే బస్టాండ్ వద్ద లారీని బస్సు వేగంగా లారీ డ్రైవర్ వైపు ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ వైపు భాగం నుజ్జునుజ్జయింది. అయితే లారీని ఢీ కొట్టిన బస్సు వేగంగా పక్కనే కల ఇంటి ప్రహరీ గోడని ఢీకొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇల్లు సగభాగం కూలిపోయింది. చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ బత్తుల తిరుమలేశు తీవ్రంగా గాయపడ్డాడు. 108 లో బస్సు డ్రైవర్ తో పాటు మరో ప్రయాణికుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని వైరా ఎస్సై వీరప్రసాద్ బోనకల్ పోలీసులు సందర్శించారు.
 
బస్సు డ్రైవర్ నిద్ర మత్తె ప్రమాదానికి కారణం....
 
డ్రైవర్ బత్తుల తిరుమలేశు ప్రమాద సమయంలో నిద్రలో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. లారీని ఢీకొట్టిన తర్వాత అతి వేగంగా బస్సు వెళ్లిపోయి ఓ ఇంటిని ఢీ కొట్టిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాద సమయంలో ఓ యువకుడు అద్దాలు లో నుంచి కింద పడినట్లు అతనికి కూడా గాయాలైనట్లు తెలిపారు. దాదాపు పది మంది వరకు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.