కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ గారిని కించపరిచేలా గాడిద ఊరేగించే కార్యక్రమం నిర్వహించడం సిగ్గు

Published: Friday February 18, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిది : కెసిఆర్ జన్మదినం రోజున ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కొంత మంది కాంగ్రెస్ నాయకులు తమ ఉనికికోసం గాడిదని ఊరేగించి కెసిఆర్ గారిని అవమాన పరిచేలా వ్యవహరించడం సిగ్గు మళ్లీనా చర్య అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ అన్నారు ఈరోజు పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. కాంగ్రెస్ నాయకులకు నిరుద్యోగం ఎక్కువ ఉందా....? తమ పార్టీ ఉనికి కోసం ధర్నాలు, రాస్తారోకలు పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే ఊరుకునేది లేదని వారు అన్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు వివరించడం సరైనది కాదని, గాడిదలు బదులు రేవంత్ రెడ్డి ఉపయోగిస్తే కాంగ్రెస్కి దరిద్రం వదులుతుంది అని వారు అన్నారు. తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ జాతిపిత కెసిఆర్ గారి ఆధ్వర్యంలో నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది అని, టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355 సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500 విద్యుత్ సంస్థ‌ల ద్వారా 6,648 డీసీసీబీలు 1571 టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తున్న‌ది అని వారు అన్నారు. కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌తో ఉంది అని అది తెలియని కొంత మంది కాంగ్రెస్ నాయకులు మూర్ఖుడిలాగా వ్యవహరించడం సరైనది కాదని వారన్నారు. తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని, అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సిఎం కేసీఆర్ ఆకాంక్ష అని అలాంటిది కేసీఆర్ జన్మదినం రోజున మూర్ఖత్వంతో చౌరస్తాలో గాడిదని ఊరేగించి గాడిద లాగా వ్యవహరించడం సరైనది కాదని వారన్నారు.