ఓటరు నమోదు కొరకు దరఖాస్తు చేసిన వెంకట్ తాల్క

Published: Monday November 28, 2022
హైదరాబాద్ 27 నవంబర్ ప్రజాపాలన: ముమ్మరంగా   నూతన ఓటరు నమోదు కార్యక్రమం. సంఘీ విధ్యా నికేతన్ తార్కాక లోని ఓటరు నమోదు కేంద్రంలో వెంకట్ తాల్క నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తును జిహెచ్ఎంసి సిబ్బంది అయిన మల్లకారం చందర్ కు బూత్ లెవెల్ ఆఫీసర్ యం.నర్సింగ్,ఆర్.పి.లు ప్రియాంక మరియు ఇందిర సమక్షంలో 
అందజేశారు.  
 
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 
భారత రాజ్యాంగ దినోత్సవం 2022 సందర్భంగా నూతన ఓటరు నమోదు సెంటర్ లను ఏర్పాటు చేశారు.రాష్ట్రలోని  వివిధ కళాశాలలు పాఠశాలలు గ్రామ పంచాయతీ  మండల స్థాయి   మున్సిపల్  స్థాయి తదితర   ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రధాన కూడళ్లలో నవంబర్ 26 మరియు 27 తేదీల్లో  నిర్వహించారు. యువతను ఆకట్టుకునే ప్రయత్నం లో బాగంగా ఆయా కళాశాలల్లో ఓటరు నమోదు సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
 
 
 తార్నాక లోని సంఘీ విధ్యానికేతన్ ఓటరు నమోదు సెంటర్ (పోలింగ్ కేంద్రాలు 201 నుండి 205) మరియు ఇతర ఓటర్ నమోదు కేంద్రాల లో యువత ఎక్కువగా నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం.