ఇళ్ళపై వేలాడుతున్న కరెంటు వైర్లను సరిచేయాలి

Published: Friday August 06, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్ట్ ప్రజాపాలన : ఇళ్ళపై వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విద్యుత్ అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో గల మోమిన్ పేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాసన్ పల్లి నర్సింహారెడ్డి సమక్షంలో ఉదయం 7 గంటల నుండి మీతో నేను కార్యక్రమంలో భాగంగా చాంద్రాయన్ పల్లి సర్పంచ్ పెద్దోల్ల అంజయ్య, కోలుకుంద గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం రావులపల్లి సర్పంచ్ కరణం పార్వతమ్మ, అమ్రాది కలాన్ సర్పంచ్ నందిగామ సుజాత నర్సిములు ఆధ్వర్యంలో వీధి వీధి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని సమస్యలను, ప్రజల కష్టాలను ఓపికగా విన్నారు. చాంద్రయన్ పల్లి  గ్రామ పర్యటనలో... నూతన రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్స్ కోసం దరఖాస్తులను తీసుకోవాలన్నారు. గ్రామంలోని ఇండ్ల మధ్యలో ఉన్న పెంట కుప్పలను తొలగించాలన్నారు. పల్లె ప్రగతిలో పిచ్చి మొక్కలు తొలగించనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న మినీ నీటి ట్యాంకును తొలగించడం లేదా మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొని రావాలన్నారు. డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నచోట ఇంకుడు గుంతలు నిర్మాణం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి మురుగునీరు నిలువకుండా సరిచేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కరెంట్ పోల్స్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. వేలాడుతున్న కరెంటు తీగలను వెంటనే సరి చేయాలన్నారు. గ్రామంలోని స్ట్రీట్ లైట్స్ కోసం ఆన్/ఆఫ్  స్విచ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెన్సింగ్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ధరణి పోర్టల్ లో అందుబాటులో ఉన్న ఆప్షన్స్ కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రావుల పల్లి గ్రామ పర్యటనలో... గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ నీటి పైపు లైన్ లీకేజీలకు మరమ్మతులు వెంటనే చేయాలన్నారు. డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. అమ్రాది కలాన్ గ్రామ పర్యటనలో... రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ పోల్ ను వెంటనే రోడ్ పక్కన  మార్చమని ఆదేశించారు. అర్హులందరికీ ఆసరా పెన్షన్, నూతన రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకోవాలన్నారు. గ్రామం మధ్యలో సీసీ రోడ్డు కు సంబంధించిన పని యొక్క అంచనా వేయమని పంచాయతి రాజ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగల పైన వాలిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వసంత వెంకట్, ఎంపిడిఓ శైలజారెడ్డి, ఎంపిఒ యాదగిరి, డిఈ కిరణ్, ఎంపిటిసి కరణం శ్రీదేవి, కరణం భుజంగం, వా‌ర్డు మెంబర్లు ప్రదీప్, మాణిక్యం, అరుణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.