రాజీవ్ గాంధీ 30 వ వర్ధంతి వేడుకలు

Published: Saturday May 22, 2021
పరిగి, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ 30 వ వర్ధంతి వేడుకలు భౌతిక దూరని పాటిస్తూ దోమ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతని చిత్రపటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం దోమ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగులకు మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ రాజీవ్ గాంధీ దూరదృష్టి, మాతృ భూమి పట్ల అంకితభావం దేశానికి ఎంతో మేలు చేసిందని కొనియాడారు. దేశంలో శాంతి నీ సోదరభావం నెలకొల్పడానికి చేసిన కృషి అమోఘం అని దోమ మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ఆయన తెచ్చిన అధికార వికేంద్రీకరణ చట్టాలు ఫలితాలను ఇస్తున్నాయి.అని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, కోవిడ్ టెస్టులు పెంచి, చికిత్సను అందించాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్, మల్లేశ్ యాదవ్,చాకలి రమేశ్ తదితరులు పాల్గొన్నారు..