బురుగుడా బిసి కాలనీలో సీసీ రోడ్డు కు భూమి పూజ ** జెడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు, ఎంపీపీ **

Published: Wednesday April 12, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 11 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా బీసీ కాలనీలో మంగళవారం జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ లు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 లక్షలు మండల నిధులతో రోడ్డు పనులు ప్రారంభించి, మరో 5 లక్షలతో జెడ్పి నిధులతో త్వరలోనే డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి ఎంతగానో జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని జాతీయ రహదారి ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, అలాగే సర్వీస్ రోడ్డు, యూటర్న్ ఏర్పాటు చేయాలని డిబిఎల్ అధికారులతో మాట్లాడారు. వీరి వెంట సర్పంచులు చౌదరి మాధవి, బూసి భీమేష్, పెద్దపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్, ఉప సర్పంచ్ పూజాది కుమార్, నాయకులు నిర్మల, శ్రీనివాస్, పెంటయ్య, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.