ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగరేయాలి...

Published: Tuesday July 20, 2021
సారంగాపూర్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి) సారంగాపూర్ మండల్ బట్టపెళ్లి పోతారంలో మండల ఇన్చార్జి బెజ్జంకి సతీష్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఘనంగా ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాదిగ సతీష్ మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహజననేత మాదిగల ఆరాధ్యదైవం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలను జులై నెల మొత్తం జరుపుకోవాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. 26 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ చేసిన పోరాట ఫలితాలను తెలియజేస్తు రాజ్యాధికారం దిశగా ఎం.ఎస్.ఎఫ్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నక్క సతీష్ తిరుపేళ్ళి దేవయ్య సిపేల్లి లక్ష్మణ్ పూడిరి రమేష్ అంజి ముత్తయ్య రాజయ్య మల్లయ్య మహేష్ మల్లేష్ నర్సయ్య రాజు నచ్చాయ్య మధు రాకేష్ మాదిగ తదితరులు  పాల్గొన్నారు.