విద్యారంగ అభివృద్ధికి బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు చేపట్టాలి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధ

Published: Wednesday August 03, 2022

బోనకల్, ఆగస్టు 2 ప్రజా పాలన ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఎం ఆర్ సి నందు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించటం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు చేపట్టాలని కోరారు. సకాలంలో పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 317 అప్పిల్స్ అన్నింటిని పరిష్కరించాలని, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని కోరారు. శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు అలవెన్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి.ప్రీతం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, యంసిఆర్ చంద్రప్రసాద్,పి.గోపొల్రావు, సర్దా బాబు, జల్లా కోటయ్య, కే రామకృష్ణ, వి.మురళి,టి. లక్ష్మి, నిర్మల, నసీమా సుల్తాన, నాగమణి తదితరులు పాల్గొన్నారు.